దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష 63వేల 816 కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.