ఉద్యోగాల్లో పురుషులతోపాటు స్త్రీలకు అవకాశం కల్పించాలి: మోడీ

ప్రభుత్వ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనన్న భావన ఇక ఎంత మాత్రం పనికిరాదన్నారు ప్రధాని మోదీ . తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో బలగాల్లో మహిళల సంఖ్య రెట్టింపయిందని అన్నారు. ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. 2014లో తాను పగ్గాలు చేపట్టినప్పుడు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్య 1.05 లక్షలు ఉండేదని.. ప్రస్తుతం అది 2.15 లక్షలకు చేరిందని తెలిపారు. భవిష్యత్‌లో కొత్త తరం పోలీసింగ్‌కు వారే సారథులవుతారన్న ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.