ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడమని.. ఆయన నాశనానికే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.ఈటల ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి తనని అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని.. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని బీజేపీ నేతలు శపథం చేశారు.

ఇక అసెంబ్లీ సస్పెన్షన్ పై ఈటల స్పందించారు. తనను అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా కేసీఆరే నిషేధం పెట్టుకున్నాడని .. కేసీఆర్‌‌నే అసెంబ్లీకి రాకుండా చేస్తానని ఈటల ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి తనని అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని.. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని ఈటల తేల్చిచెప్పారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని, బీజేపీని గెలిపించాలని అక్కడి ప్రజలు డిసైడ్ అయ్యారని ఈటల కుండబద్దలు కొట్టారు.

కాగా ఈటల సస్పెన్షన్ పై ఆపార్టీ అధ్యక్షుడు బండిసంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. స్పీకర్‌ను మరమనిషి అంటేనే సభ నుంచి సస్పెండ్ చేసేస్తారా? అని నిలదీశారు. ఈటల సస్పెన్షన్ అంశాన్ని చట్టపరంగా ఎదుర్కొని కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.బీజేపీ నేతలు చూసి సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదన్నారు. ఈటలను సస్పెండ్ చేయడం కాదు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ని రాష్ట్రం నుంచి సస్పెండ్ చేస్తారని సంజయ్ జోస్యం చెప్పారు.

ఈటల సస్పెన్షన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఈటలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.ఈటలను అసెంబ్లీకి రానివ్వను.. మాట్లాడనివ్వను.. ముఖం చూడను అంటున్నారు.. కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ ఏమన్నా టీఆర్ఎస్ జాగీరా? మరమనిషి అనేమాట అప్రజాస్వామికమా ? అని కిషన్‌రెడ్డి నిలదీశారు.

అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అకారణంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు డికే అరుణ. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా? అని ఆమె ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే అంత భయం ఎందుకు?అని నిలదీశారు. ఎమ్మెల్యే ఈటలను ఏ కారణంతో సస్పెండ్ చేసి పోలీస్ వాహనంలో తరలించారో చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.

మొత్తంమీద ఈటల సస్పెన్షన్ అంశాన్ని బీజేపీ నేతలు సీరియన్ గా తీసుకున్నారు. తగ్గేదెలే తరహాలో టీఆర్ఎస్ పై నిప్పుల చెరిగారు. బీజేపీ నేతలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు అన్న ప్రచారానికి తెరలేపారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole