కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.

ఇక మరమనిషి అన్న వ్యాఖ్యలకు సస్పెండ్ చేస్తే… అనేక భాషల్లో అసభ్య పదజాలంతో మాట్లాడే కేసిఆర్ కు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ భాష.. సంస్కృతిని సాంప్రదాయాలను కించపరిచి సీఎం కేసిఆర్ సంస్కారహినుడిగా మిగిలిపోయాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడూ  ఇలాంటి చిల్లరగాళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నాడు. తప్పు చేసిన వాళ్లే దొరల బతుకుతున్నప్పుడు.. నిజాయితీ పరుడైనా తనకెందుకు భయమని.. ఆరునూరైనా సీఎం కేసిఆర్ ను ఓడగొట్టి తీరుతానని ఈటల కుండ బద్దలు కొట్టాడు.

కాగా అసెంబ్లీలో బీజేపీ హక్కులను టిఆర్ఎస్  ప్రభుత్వం కాలరాసిందన్నారు ఈటల. సభలో ఒక సభ్యుడు ఉన్నా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని తెలిపారు. బీఏసీ అంశం గురించి బీజేపీ ఎమ్మేల్యే రఘునందన్ రావు అడిగిన స్పీకర్ పట్టించుకోలేదన్నారు.  గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని ఈటల గుర్తు చేశారు. శాసన సభలో ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఈటల ఆగ్రహాం వ్యక్తం చేశారు.  

మొత్తమీద ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటల తూటాలతో సీఎం కేసిఆర్ నూ చీల్చి చెండాడాడు. కేసిఆర్ ను ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం చేశాడు.