బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు శాతంగా ఉన్న రెడ్డిలు తెలంగాణలో 50 శాతం, ఏపీలో 70 నుంచి 80 శాతం అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా రాజ్యమేలుతున్నారు. ఆర్థిక, అంగబలాలు కలిగిన సామాజిక వర్గం రెడ్డిలు.. వ్యవసాయ, వ్యాపారం, కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ , రాజకీయాల్లో బలవంతులుగా ఎదిగారు. రెడ్లు అంటే కనీసం పది ఎకరాల భూస్వామిగా ఉండాలనే పట్టుదలతో ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం నాయకుల చేతుల్లోనే రాజ్యాధిóకారం ఉండాలని భావించే రెడ్లు సీఎం కుర్చీ కోసం ఎంత దూరమైన వెల్లడానికి సంసిద్దులుగా ఉంటారనేది నానుడి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే తమదైన ముద్ర వేసుకుంటున్న రెడ్లు.. రెడ్డిరాజుల పాలనకు ప్రతీకులుగా ఉంటూ వస్తున్నారు.
ముఖ్యమంత్రుల్లో రెడ్లే టాప్..
1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి నుంచి మొదలు కొంటె కాసు బ్రహ్మనందారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నాగం జనార్థన్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక వెలమలకు వస్తే .. జలగం వెంగల్‌రావు, నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ సీఎంగా కె. చంద్ర శేఖర్‌రావు కొనసాగుతున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రులుగా పీవీ నర్సింహరావు, దామోదర సంజీవయ్య, టుంగూరు ప్రకాశం పంతులు, అంజయ్య, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మంత్రులుగా చూస్తే కూడ రెడ్డిలే టాప్‌గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ఉంచి 20 మంది మంత్రులు ఉండే వారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడ రెడ్డి మంత్రుల హవా కొనసాగుతుంది. ఒక్క తెలంగాణలో మంత్రులుగా, ఇతర పదవుల్లో కొనసాగుతున్నారు.
సామాజిక పరంగా చూస్తే..
ఎస్సీ, ఎస్టీలు నియోజకవర్గాల్లో మినహా బీసీ వర్గాలకు ఎన్నడు సీఎం పదవులు వచ్చిన దాఖాలాలు లేవు. గతంలో అంజయ్య సీఎంగా ఉన్నా కూడా ఆయన రెడ్డిల సామాజిక వర్గానికి చెందిన వారే అనే ప్రచారం ఉండేది. ఇప్పటి వరకు రిజర్వేషన్ల పరంగా ఎస్సీ,ఎస్టీల నియోజకవర్గాల నేతల స్థానాలకు డోకా లేకుండా ఉంది. తెలంగాణలో ఎస్సీలకు 18 అసెంబ్లీ స్థానాలు, ఎస్టీలకు 12 స్థానాలు ఉన్నాయి. కాని జనాభాలో 50 శాతంపైగా ఉన్నా బీసీలకు మాత్రం 22 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. మిగిలిన అన్ని స్థానాల్లో 50 స్థానాల్లో రెడ్లు.. ఐదు నుంచి పది స్థానాల్లో వెలమలు పోటీ చేస్తు వస్తున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే రెడ్లు 34 స్థానాల్లో గెలిచారు. గత చరిత్ర చూస్తే ఇవే రెడ్డిలకు తక్కువ స్థానాలుగా ఉన్నాయి. మిగిలిన అన్ని ఎన్నికల్లోను రెడ్డిలే అధిపత్యం కనబరుస్తు వస్తున్నారు. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్‌పై తమకు తగినన్ని స్థానాల్లో అవకాశాలు లభించలేదని బీసీలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉదయ్‌పూర్ ఒప్పందాల ప్రకారం ఒక పార్లమెంట్ స్థానానికి ఇద్దరు బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ తెలంగాణలో పరిశీలిస్తే కాంగ్రెస్‌లో బీసీలకు 34 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం కాంగ్రెస్‌లో ఇది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. రానున్న ఎన్నికల్లో 40 స్థానాల్లో రెడ్డిలకే టికెట్లు వచ్చె అవకాశాలు ఉన్నాయి. బీజేపీలో కూడ రెడ్డిలకే ఎక్కువ సీట్లు వచ్చె అవకాశాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీలో చూసిన రెడ్డిలదే అధిపత్యంగా కనిపిస్తోంది.
చతురతలో వారికి వారే సాటి..
రెడ్డిలు రాజకీయాల్లో పెత్తానానికి ఎంత దూరమైన వెలతారు అనడానికి తెలుగు రాష్ట్రాల్లో అనేక తర్కణాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో సీఎం సీటు కోసం చాల మంది రెడ్డిలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని ఒక వర్గం రెడ్డిలు ప్రయత్నాలు చేస్తే.. ఆయనను సీఎం కాకుండా కూడ మరో వర్గం రెడ్డిలు లాభియింగ్ చేశారు.చివరకు కాంగ్రెస్ అధిస్ఠానం రెడ్లను కాదని సీనియర్ నేతగగా ఉన్న రోశయ్యను సీఎంగా చేసింది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని రెడ్డిలు అనేక రకాలుగా చక్రాలు తిప్పి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంగా సీల్డ్ కవర్‌లో తెప్పించుకున్నారు. ఇలాంటి ఘటనలో ఉమ్మడి రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్ రాలేదని అలిగిన పట్నం మహేందర్‌రెడ్డికి కేసీఆర్ ఆగమేఘాలపై మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఖమ్మంలో పోంగులేటి శ్రీనివాసరెడ్డికి తనకు బీఆర్‌ఎస్‌లో సముచితమైన స్థానం లభించడం లేదని కాంగ్రెస్ చేరారు. ఖమ్మంలో కేసీఆర్ పార్టీని ఓడిస్తామని చాలేంజ్ చేశారు. గత ఎన్నికల్లో కోల్లాపూర్ నుంచి పోటీ చేసిన వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావును ఓడించాలని ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని రెడ్డి సామాజిక వర్గాలు పని చేశాయనే ప్రచారం ఉంది. ఖమ్మంలోని పాలేరు అసెంబ్లీ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన షర్మిలను నిలబెట్టి గెలిపించుకోవాలని పోంగులేటి ప్రయత్నాలు చేస్తు ఉండగా ఆయన వ్యతిరేక వర్గంగా ఉన్నా.. తుమ్మల నాగేశ్వర్‌రావు ఆమెకు టికెట్ రావద్దని ఆయన కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా రెడ్డిల అధిపత్యం కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోను వారి హవా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.