స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రెండు పార్ట్ లుగా రాబోతుంది. తాజాగా పార్ట్_1 కి సంబంధించిన టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. కల్లు..పాట.. రక్తం.. పోరాటం అంతా మరచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చిత్ర టీజర్ను తెలుగులో మహేశ్ బాబు..హిందీలో అమితాబ్ బచ్చన్.. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు.
ఇక లైకా ప్రొడక్షన్స్. మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. విక్రమ్, కార్తి , జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ స్వరాలను అందించనున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ .. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.