ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

నల్లగొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఉన్న ఆపరేషన్ థియేటర్లు  అందుబాటులోకి వచ్చాయి. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స,  చెవి ముక్కు గొంతులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన  సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.    ఎంతో అనుభవం  నైపుణ్యం కలిగిన డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో  వైద్య సేవలు అప్డేట్ అవుతున్నాయని భూపాల్ రెడ్డి వెల్లడించారు.