మహిళల హాకీ ప్రపంచ కప్‌లో నాటకీయ సన్నివేశం.. షాకైన అభిమానులు!

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో ఆసక్తికరంగా సన్నివేశం చోటుచేసుకుంది. చిలీ – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా .. చిలీ ప్లేయర్ చేసిన పని స్టేడియంలోని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

చిలి – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరిబిగపట్టుకుని మ్యాచ్ నూ వీక్షిస్తున్నారు .ఇంతలో చిలీ ప్లేయర్ ఫ్రాన్సిస్కా తాలా ట్రేడ్ మార్క్ షాట్ తో గోల్ కొట్టింది. అంతే చిలీ అభిమానుల అరుపులు గోలలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆతర్వాత ఫ్రాన్సిస్కా తాలా ఆనందంతో..బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేసింది. దీంతో అవక్కావడం ప్రేక్షకుల వంతైంది.

 

ఇక మ్యాచ్ అనంతరం తాలా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నెదర్లాండ్స్‌పై గోల్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటానని.. మ్యాచ్ కు ముందు జట్టులోని అమ్మాయిలందరితో పందెం వేసినట్లు తాలా వెల్లడించింది. ప్రస్తుతానికి అతను చాలా సంతోషంగా ఉన్నాడని..హాకీ జీవితంలో అత్యుత్తమ క్షణమంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈమ్యాచ్ లో చిలీ జట్టు ఓడినా…. ఫ్రాన్సిస్కా తాలా జోడి అభిమానుల మనస్సులను గెలిచింది.