పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహరవవీరమల్లు’ టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.
ఇదిలా ఉంటే అది పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని..’ స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం ‘చిత్ర పోస్టర్ నూ ఒకరోజు ముందే చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇటు టీజర్ ..అటు పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచిసిందంని ఇండస్ట్రీలో టాక్ వినబడుతోంది. ఇటు జల్సా మూవీ రీ రిలీజ్ తో థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. వీరమల్లు చిత్ర టీజర్ సూపర్ గా ఉందని.. మరోసారి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవడం ఖాయమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈచిత్రం.. ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా 2023 ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈసినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని టాక్ వినబడుతోంది. పవర్ స్టార్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి హరి వీరమల్లు.. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని టాక్ నడుస్తోంది.ఇక ఈసినిమాతో పాటు తమిళ్ సినిమా వినోదం సీతం తెలుగు రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.