ఆర్ఎస్ఎస్ పై మమతా ప్రశంసలు.. స్వార్థం కోసమే అంటూ నేతలు కౌంటర్..!!

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. అవకాశం దొరికితే కాషాయం నేతలపై విరుచుకుపడే మమతా..ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ పై ప్రేమను కురిపించడం ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.అసలు ఉన్నట్టుండి ఎందుకిలా మమతా ప్రవర్తించారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.

కాగా పశ్చిమబెంగాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని..సిద్ధాంతాలకు కట్టుబడిన నేతలు బీజేపీలో ఇంకా ఉన్నారంటూ ఆమె పేర్కొన్నారు.అయితే 2003 లో ఆర్ఎస్ఎస్ మమతా బెనర్జీని దుర్గ గా అభివర్ణించింది..దానికి బదులుగానే ఆమె ఆర్ఎస్ఎస్ ను దేశభక్తులుగా చెబుతున్నారంటూ కొందరు నేతలు సమర్థిస్తుండగా..మరికొందరు నేతలు మాత్రం స్వార్థ రాజకీయాలతోనే ప్రశంసలు కురిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక ఆర్ఎస్ఎస్ నూ ప్రశంసించడం మమతాకు కొత్తకాదని.. ప్రధాని వాజ్ పేయి హాయంలోనూ ఎన్ డీఏ ప్రభుత్వం జతకట్టిన విషయాన్ని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు.కేవలం రాజకీయ స్వాలాభం కోసమే ఆమె అలా మాట్లాడారని ఆరోపించారు.మరోవైపు కమ్యూనిస్టు నేతలు దీదీపై విరుచుకుపడ్డారు. తృణమూల్ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. మమతా ఆర్ఎస్ఎస్ తయారు చేసిన వ్యక్తి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

అటు మమతా వ్యాఖ్యాలపై ఆర్ఎస్ఎస్ ఘాటుగా స్పందించింది. ఎవరూ మంచివారో.. ఎవరూ చెడ్డవారో దీదీ నుంచి సర్టిఫికేట్ అవసరంలేదని స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత 60 మంది హత్యకు గురయ్యారని.. పొగిడినంత మాత్రానా పొంగిపోనవసరం లేదని.. శాంతి భద్రతలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యక్త ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ జిష్ణు బసు హితువు పలికారు.