బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది. నందిగ్రామ్ బీజేపి అభ్య‌ర్థి సువెందు అధికారి టీఎంసీ నుంచి వెళ్లిపోవ‌డం, త‌న వ్యూహ‌లు అంత‌గా ప‌నిచేయ‌లేదు’ అని చెప్పిన‌ట్లుగా ఆడియో క్లిప్‌లో ఉంది.
ఈ ఆడియో క్లిప్పింగ్స్‌ పై ప్ర‌శాంత్ కిశోర్ స్పందిస్తూ.. తాను మాట్లాడిన మాట‌ల్ని పూర్తిగా వ‌క్రీకరించారు. నిజనిజాలు తెలియాలంటే పూర్తి ఆడియో క్లిప్ బ‌య‌ట‌పెట్లాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Optimized by Optimole