ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మకు మద్దతు ప్రకటించారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. బీజేపీకి ప్రత్యక్షంగానో , పరోక్ష కూటమికి వ్యతిరేకంగానో ఈనిర్ణయం తీసుకోవడంలేదని.. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.తమ పార్టీ సిద్దాంతాల అనుగుణంగానే.. గిరిజన మహిళకు మద్దతూ ఇస్తున్నట్లు తెలిపారు.
ఇక రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక విషయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి తమను సంప్రదించలేదని పరోక్షంగా చురకలంటించారు. దళితుల నాయకత్వం ఉన్న పార్టీ జాతీయస్థాయిలో బీఎస్పీ మాత్రమేనని ఆమె అన్నారు. మేము ఏపార్టీని అనుకరించబోమని.. మాకంటూ సిద్దాంతాలు ఉన్నాయన్నారు. ఎల్లవేళలా అణగారిన వర్గాల శ్రేయస్సుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఏపార్టీ వ్యక్తులు అయినా సరే.. మా పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసనాలు పక్కనపెట్టి ప్రోత్సహిస్తామని మాయవతి పేర్కొన్నారు.