ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో ముందంజలో ఉంది. కరోనా కేసుల పెరుగదల దృష్ట్యా
ఐదవ టెస్ట్ వాయిదాపడింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో .. ఐదవ టెస్ట్ ఆడేందుకు భారత ఆటగాళ్లు ఇంగ్లాడ్ కు వెళ్లారు. అయితే రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా రోహిత్ కు పాజిటివ్ తేలింది.ప్రస్తుతం అతడు బసచేసిన హోటల్లో ప్రత్యేక క్వారంటైన్లో ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఇక హిట్ మ్యాన్ కరోనా బారినపడటంతో బీసీసీఐ పునారాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటం.. జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఇంగ్లాడ్ తో ఐదో టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.