వారసత్వం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్ యూ) నడపడం కుదరదని, వాటికి కాలం చెల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజాధనంతో నడుస్తున్న అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని..వాటి ఆర్ధిక భారం భరించడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రయివేటికరణ అంశంపై బుదవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వేబినార్ లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని, కేవలం సహాయం మాత్రమే అందిస్తుందని మోదీ స్పష్టంచేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, అభివృద్ధి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నామని ఆయాన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేవేటికరణ చేసి తీరుతామని, ప్రజాసంక్షేమం కోసం ఎవరేమన్నా సంస్కరణలు తీసుకొస్తామని మోదీ పేర్కొన్నారు.