పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి, మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సమర్థంగా  నడిపిన రాజనీతిజ్ఞుడు అని కేంద్ర సహాయమంత్రి కొనియాడారు.