పివి సింధు డ్యాన్స్ వీడియో వైరల్!

స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లోని పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోని..సింధు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈవీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.గతంలో సింధు కచాబాదం, మాయకిర్రియే పాటలకు డ్యాన్స్ చేసిన వీడియో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేయడంతో..నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

సింధు వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ..మీ ఆట తీరుతో ప్రతి భారతీయుడి గర్వపడేలా చేశారు. డ్యాన్స్ వీడియో చాలా బాగుందంటూ కామెంట్ చేశారు. మరోకరు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి “ఆల్ రౌండర్” అంటూ కామెంట్ చేయగా..ఇంకొకరు పివి సింధు హ్యాట్సాఫ్! అందుకే మీరు గొప్ప క్రీడాకారిణి.. చాలా అందంగా ఉన్నారంటూ క్యాప్షన్ జతచేశాడు.