రామబాణం రివ్యూ..

రామబాణం రివ్యూ..

గోపిచంద్ – శ్రీవాస్ కాంబోల తెర‌కెక్కిన చిత్రం రామ‌బాణం. ల‌క్ష్యం ,లౌక్యం వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న‌ ఈమూవీపై సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు వ‌రుస ప్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపిచంద్.. రామ‌బాణంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని దృఢ‌నిశ్చ‌యంతో ఉన్నాడు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం!

కథ:

ర‌ఘుదేవ‌పురం అనే గ్రామంలో రాజారామ్‌(జ‌గ‌ప‌తిబాబు) భార్య భువ‌నేశ్వ‌రి(కుష్భు)తో క‌లిసి హోట‌ల్ న‌డుపుతుంటాడు. అత‌ని వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయ‌లు అన్న చందంగా సాగుతుంది. ఈవిష‌యం జీర్జించుకోలేని పాపారావు (నాజర్‌) అత‌ని హోట‌ల్ పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డి లైసెన్స్ తీసుకెళ్లిపోతారు. దీంతో రాజారామ్ త‌మ్ముడు విక్కీ (గోపిచంద్‌) కోపంతో పాపారావుపై ఇంటిపై దాడిచేసి లైసెన్స్ తీసుకోస్తాడు. త‌మ్ముడు చేసిన ప‌ని న‌చ్చ‌ని రాజారామ్.. విక్కీని మంద‌లిస్తాడు. అది న‌చ్చ‌ని విక్కీ సొంత ఊరు వ‌దిలి కోల్ క‌త్తా వెళ్లిపోతాడు. అక్క‌డ అత‌ను ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి వ‌చ్చింది? యూట్యూబ‌ర్ భైర‌వి( డింపుల్‌)తో ప్రేమాయ‌ణం సంగంతేంటి? 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత సొంత ఊరు ఎందుకు తిరిగి రావాల్సి వ‌చ్చింది? తెలియాలంటే వెండితెర‌పై సినిమాను చూడాల్సిందే..

ఎలా ఉందంటే:

యాక్ష‌న్ , ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలోచ్చాయి.రామ‌బాణం ఆకోవ‌కు చెందిందే. కాక‌పోతే పాత క‌థే అయినా.. స‌రికొత్త మేళ‌వింపుల‌తో ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు సినిమాను మ‌లిచే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌స్ట్ ఆఫ్ ఓకే అనిపించినా.. సెకాండాఫ్ మాత్రం ప్రేక్ష‌కుల స‌హానానికి ప‌రీక్ష పెడుతుంది. హీరో ,హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అంత‌గా అనిపించ‌దు. కామెడీ సీన్స్ తేలిపోయాయి. ప్రీక్లైమాక్స్ కు ముందు వ‌చ్చే ఎమోష‌న్ సీన్స్ ,క్లైమాక్స్ ఆక‌ట్టుకుంటాయి. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. ఎంత సంపాదించిన, కుటుంబం ఎంతో ముఖ్యం డైలాగ్ సినిమాకు హైలెట్.

ఎవరెలా చేశారంటే..?

న‌ట‌న‌ప‌రంగా గోపిచంద్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. స్టైలిష్ లుక్ లో యాక్ష‌న్ సీన్స్ తో దుమ్మురేపాడు. హీరోయిన్ డింపుల్ పాత్ర‌కు అంత‌గా స్కోప్ లేద‌నే చెప్పాలి. ఉన్నంత‌లో పెర్మార్ఫెన్స్ తో ఆక‌ట్టుకుంది. జ‌గ‌ప‌తిబాబు, కుష్బు పాత్ర‌లు సినిమాకు మెజ‌ర్ ఎసెట్ అనే చెప్పాలి. నాజ‌ర్ , త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో మెప్పించారు. మిగ‌తా న‌టీన‌టులు పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతికత పనితీరు..

ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ ను సూటిగా చెప్పేశాడు. కాక‌పోతే స్క్రీన్ ప్లే ప‌రంగా కేర్ తీసుకుంటే బాగుండేది. కెమెరా ప‌నిత‌నం బాగుంది. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌పై క‌నిపిస్తుంది.

(సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో రివ్యూ ఇవ్వబడింది)

చివరగా మ‌రోసారి గురిత‌ప్పిన గోపి ‘బాణం’

రివ్యూ: 2.5/5