టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీ ఒక్క బాలీవుడ్లోనే వందకోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలోనే క్రేజ్ దృష్ట్యా ప్రత్యేక సాంగ్ కోసం యానిమల్ చిత్ర యూనిట్ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాక ఆమె త్వరలోనే ఓ బాలీవుడ్లో చిత్రంలో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.
కాగా రష్మిక.. శర్వానంద్‌తో కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప ది రూల్’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది.