‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ విడుదల!

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ లిరికల్ నూ చిత్ర బృందం విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు అభిమానుల ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు.

Optimized by Optimole