దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,36,256 మందికి కొవిడ్​​ సోకింది. కరోనా​ ధాటికి 7,874 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,21,03,318 కు చేరింది. మొత్తం మరణాలు 50,87,705కి చేరాయి.