భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని.. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా నిలుస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మాస్టర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల రోడ్ సేఫ్టీ కి సంబంధించి రాయ్ పూర్ లో జరిగిన క్రికెట్ టోర్నీలో సచిన్ నాయకత్వంలోని ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందేే.
ఇక ఇదే టోర్నీలో ఇండియా లెజెండ్ తరఫున ఆడిన మరో మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ కి సైతం కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్నాడు. తాను క్షేమంగా ఉన్నానని, వైద్యుల పర్యవేక్షణలో మేరకు ఇంట్లోనే ఇంట్లో ఉన్నట్లు.. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన ట్వీట్ లో పేర్కొన్నాడు.