శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటన..

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఈ సంస్థ మీడియా అవార్డ్స్ ఇస్తోంది. దివంగత నటుడు  అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డ్స్ ప్రారంభించారు.  అప్పటి నుంచి శృతిలయ అవార్డ్స్ ఎంపిక కమిటీ  చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరిస్తున్నారు. ఇక ఈనెల 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతి లో బెస్ట్ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి..  తెలంగాణ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా  పురస్కారం అందజేయనున్నారు.

ఇక  ఈసారి  బెస్ట్ జర్నలిస్ట్ గా  సాక్షి సంస్థ నుంచి డి. వి. ఆర్. భాస్కర్ ఎంపికయ్యారు. దశాబ్ద కాలానికి పైగా ఆయన మీడియా రంగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందిన ఆయనను .. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపిక చేయడం పట్ల పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. tv 5 స్పెషల్ కరస్పాండెంట్  దారా సత్యనారాయణ ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపికయ్యారు. మీడియా రంగంలో దశాబ్ద కాలానికి పైగా విశేష సేవలందిస్తున్నందుకుగాను ఎంపిక కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపికజేసింది.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole