‘రన్ మెషిన్’ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు .. క్రికెట్లో కాదండోయ్..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు పేలవ ఫామ్ తో సతమతమవుతోన్న రన్ మెషిన్ ..ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో చెలరేగి ఆడి కెరీర్ లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.టోర్నీలో వ్యక్తిగతంగా 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లోనూ కోహ్లీ ఇదే జొరు కొనసాగిస్తే టీంఇండింయా కప్ కొట్టడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇక మైదానంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పరుగుల రారాజు మరో రికార్డు సాధించాడు.ట్విట్టర్ లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

కాగా కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పడూ క్రికెట్ తో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటాడు.కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను తరుచూ షేర్ చేస్తుంటాడు.ముఖ్యంగా తన సతీమణి హీరోయిన్ అనుష్కశర్మ తో కలిసి దిగిన ఫోటోలకు నెట్టింట ఆదరణ ఎక్కువగా ఉంది. ఇక కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో 211 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఫేస్ బుక్ లో 49 మిలియన్ల మంది విరాట్ ను అనుకరిస్తున్నారు. మొత్తంగా రన్ మెషిన్ ఫాలోవర్ల సంఖ్య 310 మిలియన్లకు చేరింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా మిగతా ఆటగాళ్ల పోల్చితే అత్యధిక ఫాలోవర్లు కలిగిన మూడో ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. అతని కంటే ముందు పుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డ్ 450 మిలియన్ల ఫాలోవర్లతో మొదటిస్థానంలో ఉన్నాడు. లియోనల్ మెస్సి 333 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.భారత్ ఆటగాళ్లలో ఎవరూ కూడా కోహ్లీ దరిదాపుల్లో లేకపోవడం గమన్హారం.

Optimized by Optimole