Rajannasirisilla: వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు . జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటైజేశన్ ప్రోగ్రాం చేపట్టారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, క్లోరో స్కోప్ టెస్ట్ వంటి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని.. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఇక పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల బెడద ఉండకుండా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు.ఏదైనా సమస్య ఉంటే సంప్రదించాలని.. తమ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.