ఆసీస్ పై విరాటా’సూర్య’ ప్రతాపం ..టీ20 సిరీస్ భారత్ కైవసం..!!

indvsaus:ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మూడు వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.దీంతో టీ20 సిరిస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్  నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రీన్, టీమ్ డేవిడ్ అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు తీయగా.. భువీ, చాహల్‌, హర్షల్ తలో ఓ వికెట్‌ తీశారు.

అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలిఉండగానే చేధించింది. పరుగుల రారాజు కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ అర్థసెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.ముఖ్యంగా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆసీసీ బౌలర్లను ఆటాడుకున్నాడు. చివర్లో హార్థిక్ పాండ్యా(25) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సూర్యకుమార్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా అక్షర్ పటేల్ నిలిచాడు.

Optimized by Optimole