మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని.. ఖైతాపురం, కొయ్యలగూడెం, మందొల్ల గూడెం, తూర్పుగూడెం, సింగరాయ చెరువు, కుంట్లగూడెం, అంకిరెడ్డి గూడెం గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన 400 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.వారికి రాజగోపాల్ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే..మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాల్లో ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి రాజగోపాల్ పాల్గొన్నారు. మునుగోడు చౌరస్తా నుంచి చండూరు రోడ్డు వరకు 3 వేల మంది మహిళలు బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ పాటలతో మహిళలు సందండి చేశారు.