మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు.
కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.ఉప ఎన్నిక అనగానే కేసీఆర్ .. దళిత బంధు,గిరిజన బంధు అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారని ఎద్దేవ చేశారు.హుజురాబాద్ బై ఎలక్షన్ అన్న కేసీఆర్..ఇప్పటివరకు ఆహామీని అమలుచేయలేదని మండిపడ్డారు.స్టీరింగ్ కమిటీ భేటిలో సభ్యుల సలహాలు .. సూచనలు అనుగుణంగా నియోజకవర్గాల వారిగా ఇంచార్జ్ లను నియమించినట్లు వెంకటస్వామి స్పష్టం చేశారు.ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.త్వరలోనే ఉప ఎన్నిక మ్యానిఫెస్టో విడుదల చేస్తామని వెంకటస్వామి పేర్కొన్నారు.
అటు బీజేపీలోకి చేరికలను వేగవంతం చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్, 5వార్డు, 12వ వార్డు.. 13వ వార్డు సభ్యులు,అనుచరులు పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు రాజగోపాల్. ప్రజలంతా తనవెంట ఉన్నారని ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచితీరుతానని ఆయన తేల్చిచెప్పారు.టీఆర్ఎస్ నేతలు అవినీతి సోమ్ముతో నేతలను కోనేందుకు ప్రయత్నిస్తోందన్నారు.ఉప ఎన్నిక తీర్పుతో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతామని రాజగోపాల్ స్పష్టం చేశారు.
మొత్తంమీద మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నోటిఫికేషన్ వెలువడకముందే కార్యచరణను ప్రారంభించి.. క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసేందుకు వ్యూహాలను అమలుచేస్తోంది.