×

National:

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.


అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేప‌ట్ట‌నుంద‌ని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.


డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.
మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు.
18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది.
డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది.
ప్రధాన అభ్య‌ర్థుల‌ స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు.
మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది.
డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.
సినీ నటడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.


తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి.
ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి.
టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది.ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది.
విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల...

Read out all

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు...

Read out all

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్...

Read out all

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
Optimized by Optimole