×

National:

కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది.
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి.


కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది.
ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్‌డీఎఫ్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టకపోవడం ఇక్కడ విశేషం.
ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్‌కు 14.5 శాతం మద్దతిచ్చారు. ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.

కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

National: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు...

Read out all

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు...

Read out all

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్...

Read out all

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
Optimized by Optimole