రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్ 16 పరుగులతో విజయం సాధించి సీరిస్ ను 2_0 తో కైవసం చేసుకుంది.

తొలుత రాహుల్.. ఆపై’ సూర్య’ ప్రతాపం..
తొలుత బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రాహుల్ , రోహిత్ అదిరే ఆరంభం ఇచ్చారు. ఆదినుంచే దంచుడు కార్యక్రమం మొదలెట్టారు. ముఖ్యంగా రాహుల్ ఆచితూచి ఆడుతూనే చెత్తబంతులను చీల్చిచెండాడు. ఈక్రమంలో ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ వస్తూనే సునామీలా విరుచుకుపడ్డాడు. స్పీప్, కట్ ,క్లిక్ ,.. చూడముచ్చటైన షాట్స్ తో సఫారి బౌలర్లను బెంబెలెత్తించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు.మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ సైతం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చివర్లో సూర్య ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ ఫోర్ ,రెండు సిక్సర్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

మిల్లర్ ..కిల్లర్

భారీ లక్ష్య చేధనలో  సఫారి జట్టు ఆరంభం పేవలంగా సాగింది. కెప్టెన్ బవుమా ,రొసో డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన డికాక్ , మార్ క్రమ్ కొంచెసేపు భారత బౌలర్లను నిలువరించారు. ఈక్రమంలోనే మార్ క్రమ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిల్లర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు ,సిక్సర్లతో స్టేడియాన్ని హోరిత్తించాడు.అటు ఓపెనర్ డికాక్ సైతం తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈక్రమంలోనే ఆఖరి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టి మిల్లర్ శతకాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరు చెలరేగిన జట్టును మాత్రం ఓటమిని నుంచి గట్టేక్కించలేకపోయారు.దీంతో మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే సాధించడంతో 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

 

 

Optimized by Optimole