Telangana: శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక…చైర్మన్గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి…!

సూర్యాపేట:  ఆత్మకూరు (s) మండలం శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,( కాంగ్రెస్ పార్టీ లీడర్ )పాలక వర్గం సభ్యులు ఎన్నికైన్నారు. ఈ ఎన్నిక సందర్బంగా నూతన ఛైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్ రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి, మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు.


ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన దేవాలయం చైర్మన్ టి. కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, ఏఐసీసీ సభ్యులు నరోత్తమ్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనా రెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి మరియు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ…అమ్మ వారి దేవాలయంకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలందిచానికి, దేవాలయం అభివృద్ధి కి పాలుపడతాన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పాలక మండలి సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Optimized by Optimole