Tennis: డైవర్స్ తీసుకోబోతున్న స్టార్ షట్లర్…!!

హైదరాబాద్:

భారత బ్యాడ్మింటన్ స్టార్‌ జంట – సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోమవారం అధికారికంగా వెల్లడించారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ అందరినీ కోరుతున్నా,” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

సైనా – కశ్యప్ ప్రేమ కథ 2010లో జూనియర్ స్థాయిలో మొదలైంది. బ్యాడ్మింటన్‌ అకాడమీ శిక్షణలో మొదలైన వీరి స్నేహం, నెమ్మదిగా ప్రేమగా మారింది. 2018 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో జరిగిన సాదాసీదా వేడుకలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ప్రస్తుత వీరి విడాకుల ప్రకటన అభిమానులను, క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసింది. ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో దశాబ్దాలకు పైగా దేశానికి సేవలందించిన గొప్ప క్రీడాకారులు. కానీ గత కొన్ని నెలలుగా వీరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి.

Optimized by Optimole