‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                                                                                                                                                           కాగా వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజ్‌ నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చిత్రం విడుద‌ల రోజు నుంచి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోష‌ల్ మీడియా వేదికగా ‘వ‌కీల్ సాబ్’  టీంకి అభినందనలు తెలియ‌జేస్తున్నారు.