Thangalaan review: మన కొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు..!
Gurramseetaramulu: వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు…