మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..
మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…