‘మిస్సైల్ మ్యాన్’ స్మృతిలో..!!
శాస్త్రవేత్త..తత్వవేత్త..సాహితీవేత్త..ప్రకృతి ప్రేమికుడు..మార్గదర్శకుడు..అన్నిటికి మించి గొప్ప మానవతావాది..’మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ‘ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను యావత్ భారతావని స్మరించుకుంటుంది. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు.1958 మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తాను కలలు కన్న పైలట్ కల త్రుటిలో చేజారి పోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. 1969 భారతదేశం తొలి…