Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?
Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది….