‘అల్పజీవి’ పుస్తక సమీక్ష..
Ganesh Thanda :(Senior journalist) (ఒక్కసారి చదవడం మొదలుపెడితే, అది పూర్తి చేసే దాకా వదలబుద్ధి కానివ్వకుండా ఆకట్టుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ‘అల్పజీవి’ ఒకటి.) నాకు ఉన్న మంచి అలవాట్లలో పుస్తకాలు చదవడం ఒకటి! కానీ, చాలా రోజులుగా పుస్తకాలు చదవడానికి నాకు నేను తగిన సమయం కేటాయించులేకపోయాను. ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి రావడం… ఫోన్ పట్టుకోవడం మళ్లీ లేచి ఆఫీసుకు వెళ్లడం… ఇదే నా జీవిత చక్రమైపోయింది. బద్ధకమో, నిరాశో, ఒత్తిడో…