ఆషాడ మాస బోనాల ప్రత్యేకత!
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి. బోనం విశిష్టత! భోజనం ప్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. జంటనగరాల్లో…