బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?
Nancharaiah merugumala senior journalist: బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా! తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా…