టీ 20వరల్డ్ కప్ వేదికగా దాయాదుల సమరం!
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండ్ మజానే వేరు. ఇరు దేశాల నెలకొన్న వాతావరణం దృష్ట్యా.. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ తర్వాత ఇరు జట్లు ఇప్పటివరకు ముఖాముఖి తలపడలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు దాయాదుల మధ్య సమరానికి టీ 20 ప్రపంచకప్ వేదిక కానుంది. దుబాయ్ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్–2021 గ్రూప్‌ల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండటంతో ఇరుదేశాల మధ్య పోరు ఖాయమైంది. 2019…