కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు!
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం. బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్…