Bollywood
Moviereview: సత్యం సుందరం రివ్యూ..షరతుల్లేని ప్రేమ..!
SatyamSundaram review: అన్‌కండిషనల్ లవ్ అనికూడా అనొచ్చు. దీనికోసం పరితపించని హృదయాలుంటాయా? మనలో ఉండే చిన్నవో పెద్దవో లోపాల్ని సైతం పక్కనబెట్టి మనల్ని మనసారా అభిమానించే వ్యక్తి ఎదురైతే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది? ఆ పరిచయం, ఆ అనుభవం ఎంత తక్కువ కాలమన్నది ప్రశ్నే కాదు. అది స్త్రీపురుషుల మధ్య ఆకర్షణా అయివుండాల్సిన అగత్యమూ లేదు. కొండంత కోపంతో, అసహనపు ఆనవాళ్లను తుడిచేసుకుని వీలైనంత వేగంగా అసౌకర్యాల నీడలనుంచి పారిపోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వసలు ఊహించనంత…