Castcensus: కులగణనపై మోదీ యూ-టర్న్ ఎవరికి లాభం?
Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా…