Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు…!!
Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో…