Crime: ప్రేమ, నమ్మకం, మోసం.. చివరికి పోలీస్ స్టేషన్ దాకా!
Vikarabad: పెళ్లికి ముందు ప్రేమ…తర్వాత పెళ్లి…భర్తకు అసలు విషయం తెలియడం విడాకులు… మళ్ళీ ప్రియుడి చెంతకు చివరాఖరికి ఒంటరి.మీరు వింటుంది సినిమా కథ కాదు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో వివాహిత ప్రేమగాథ. అసలు విషయానికొస్తే.. బెల్కటూరు గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య ప్రేమాయణం గత కొంతకాలంగా కొనసాగింది. అయితే, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో, అక్షితకు కర్ణాటకకు చెందిన మరో యువకుడితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం…