కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు…