ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!
దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు. సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..? పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త…