ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు.
సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..?
పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త అని కొద్దీ మాత్రమే తెలుసు. వ్యవసాయ చట్టాలపై మొదటి నుంచి బాలీవుడ్ నటులు రైతులకు మద్దతుగా ప్రకటనలు చేస్తుండడం తెల్సిన విషయమే. సిద్దు కూడా గతంలో చట్టాలకు వ్యతిరేకంగా గళం వినిపించాడు. కాగా మంగళవారం రైతుల ట్రాక్టర్ ర్యాలీలో తనదైన శైలిలో ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టడం.. ర్యాలీ రూట్ మ్యాప్ మార్చి ఎర్రకోట వైపు మళ్లించి జెండా ఎగరవేశాడని వినిపిస్తున్న సమాచారం. సిద్దూ పాత్రపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాగా ప్రధాని మోదీతో సిద్దు గతంలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ అల్లర్ల వెనక ఎవరి పాత్ర ఏంటి అన్నదానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.