పంజాబ్ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్!
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు ప్రేరేపించిన కేసులో సిద్దు ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు మేజిస్ట్రేట్ కి తెలిపారు. దీంతో ఆయనను వారంరోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై సిద్దూ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం…